అంతకు మించిన ప్రశంస లేదన్న పూరి!

'' After watching TEMPER “నా వారసుడివి నువ్వే” – దాసరి నారాయణరావు Advertisement This is da biggest compliment in my life, and it's much much bigger than…

'' After watching TEMPER “నా వారసుడివి నువ్వే” – దాసరి నారాయణరావు

This is da biggest compliment in my life, and it's much much bigger than da success I Hav ever achieved..''

అంటూ తన అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇది తన జీవితంలో అందుకొన్న అతి గొప్ప ప్రశంస అని పూరి చెప్పడమే ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. టెంపర్ సినిమా చూసిన తర్వాత దాసరి నారాయణ రావు ఇలా స్పందించారట. తన వారుసుడు పూరినే అని పూరితోనే చెప్పాడట! 

శతాధిక చిత్ర దర్శకుడు అయిన దాసరి దర్శకత్వం విషయంలో పూరిని తన వారసుడిగా.. అంటే తన లాంటి దర్శకుడిగా ప్రకటించి ఉండాలి. ఒకనాడు తను ఎలాంటి దర్శకుడినో.. ఇప్పుడు పూరి అలాంటి దర్శకుడని చెప్పి ఉండాలి. మరి పొగడ్త పూరిని అమితంగా ఆనంద పెట్టినట్టుగా ఉంది. 

తన జీవితంలో ఇంతకు మించిన ప్రశంసలేదని ఈ దర్శకుడు ప్రకటించుకొన్నడమే అందుకు రుజువు. విశేషం ఏమిటంటే.. వర్మ క్యాంప్ నుంచి వచ్చిన పూరి కి దాసరితో ఈ తరహా అనుబంధం ఉందని మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు వీరి అనుబంధం గురించి అందరికీ అర్థం అవుతోంది.