ఫ్లాప్‌ అవుతున్నాయంటే.. అవ్వవా?

తెలుగు సినిమా మార్కెట్‌ యాభై కోట్ల రేంజికి పెరిగిందని, తరచుగా యాభై కోట్లు వసూలు చేసే సినిమాలు వస్తాయని అనుకున్నారు కానీ అదంత సులభం కాదని ఈమధ్య వస్తున్న భారీ సినిమాలు తేల్చేస్తున్నాయి. యాభై…

తెలుగు సినిమా మార్కెట్‌ యాభై కోట్ల రేంజికి పెరిగిందని, తరచుగా యాభై కోట్లు వసూలు చేసే సినిమాలు వస్తాయని అనుకున్నారు కానీ అదంత సులభం కాదని ఈమధ్య వస్తున్న భారీ సినిమాలు తేల్చేస్తున్నాయి. యాభై కోట్లకి పైగా షేర్‌ సాధించాలంటే సదరు చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆమోదం పొంది తీరాలి. 

ఏదో ఒక వర్గాన్ని ఆకట్టుకుంటే నలభై కోట్ల పరిధికే బిజినెస్‌ పరిమితం అవుతుంది. అదే అన్ని వర్గాల నుంచి ఆమోదం లభిస్తే అరవై కోట్లు సాధించడం కూడా అంత కష్టమేం కాదని రుజువైంది. ఇటీవల వచ్చిన భారీ చిత్రాల్లో గోపాల గోపాల, గోవిందుడు అందరివాడేలే రెండూ మంచి సీజన్‌లో రిలీజ్‌ అయి… ఘనమైన ఓపెనింగ్స్‌ తెచ్చుకుని పది రోజుల తర్వాత అస్సలు నిలబడలేకపోయాయి. ఫలితంగా రెండిటికీ నలభై రెండు కోట్ల వరకు షేర్‌ వచ్చింది. 

అన్ని వర్గాలని ఒకే రీతిన ఆకట్టుకోలేకపోయిన టెంపర్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. అదే దూకుడు, గబ్బర్‌సింగ్‌, రేసుగుర్రంలాంటి యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న సినిమాలు అవలీలగా యాభై కోట్ల మార్కుని దాటగలిగాయి. స్టార్‌ హీరోలు ఉన్న ప్రతి సినిమానీ యాభై కోట్ల రేంజ్‌లో బిజినెస్‌ చేస్తున్నారు. ఫలితంగా చాలా వరకు ఫ్లాపవుతున్నాయి. అలా కాకుండా సినిమా జోనర్‌ ఏంటి, దాని అప్పీల్‌ ఎంత అనేది ముందే అంచనా వేసుకుని బిజినెస్‌ చేసినట్టయితే ఫ్లాపులు తగ్గి, హిట్ల సంఖ్య పెరుగుతుంది.