వ‌ర్మ సినిమాలో జ‌గ‌ప‌తి

లెజెండ్‌లో ప్రతినాయ‌కుడిగా క‌నిపించిన‌ప్పటి నుంచీ… జ‌గ‌ప‌తిబాబు కెరీర్ మ‌రో మలుపు తిరిగింది. ఆయ‌న న‌టించిన సినిమాలు ఆడినా, ఆడ‌క‌పోయినా.. ఆయ‌న‌కు మాత్రం మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.  Advertisement ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ సినిమాలోనూ ఆయ‌న…

లెజెండ్‌లో ప్రతినాయ‌కుడిగా క‌నిపించిన‌ప్పటి నుంచీ… జ‌గ‌ప‌తిబాబు కెరీర్ మ‌రో మలుపు తిరిగింది. ఆయ‌న న‌టించిన సినిమాలు ఆడినా, ఆడ‌క‌పోయినా.. ఆయ‌న‌కు మాత్రం మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. 

ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ సినిమాలోనూ ఆయ‌న ప్రతినాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. రాంగోపాల్ వ‌ర్మ – మంచు మ‌నోజ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. నిన్నమొన్నటి దాకా వుంటుందా వుండదా అనుకున్నారు. ఇప్పుడు వుండే అవకాశాలే ఎక్కువ వున్నాయి. 

ఈ సినిమాకు ప్రతినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబుని ఎంచుకొన్నట్టు స‌మాచారం. మ‌నోజ్‌, జ‌గ‌ప‌తి క‌ల‌సి ఇది వ‌ర‌కు క‌రెంటు తీగ‌లో క‌ల‌సి న‌టించారు. కాంబినేష‌న్ ప‌రంగా ఇది రెండో సినిమా. వ‌ర్మ సినిమా గాయంతో త‌న కెరీర్ మ‌ల‌చుకొన్న జ‌గ‌ప‌తికి ఈ సినిమా ఎలాంటి ట‌ర్న్ తీసుకొస్తుందో చూడాలి.