ఎన్టీఆర్ ప‌క్కన ర‌కుల్ ఫిక్స్‌

ర‌కుల్ ప్రీత్ సింగ్ పంట పండింది. వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం అందుకొంటోంది. మొన్న ర‌వితేజ సినిమా… నిన్న రామ్‌చ‌ర‌ణ్‌తో జోడీ… ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ న‌టించే ఛాన్స్ అందుకొంది. ఎన్టీఆర్ –…

ర‌కుల్ ప్రీత్ సింగ్ పంట పండింది. వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం అందుకొంటోంది. మొన్న ర‌వితేజ సినిమా… నిన్న రామ్‌చ‌ర‌ణ్‌తో జోడీ… ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ న‌టించే ఛాన్స్ అందుకొంది. ఎన్టీఆర్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. బి.వి.ఎస్‌.ఎన్. ప్రసాద్ నిర్మాత‌. 

ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌కుల్‌ని ఎంచుకొన్నారు. ఈ ఛాన్స్‌తో ర‌కుల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన‌ట్టే. మ‌రోవైపు మ‌హేష్‌బాబు – శ్రీ‌కాంత్ అడ్డాల‌ బ్రహ్మోత్సవంలోనూ ర‌కుల్ క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని చెబుతున్నారు. ఆ మాటే నిజ‌మైతే.. ర‌కుల్‌ని త్వర‌లోనే కోటి తార‌గానూ చూడొచ్చు.