అనుపమ నుంచి మాళవికకు

అనుకున్నవి అన్నీ జరగవు. పాపం, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కు సరైన హీరోయిన్ దొరకలేదని బోగట్టా. ఆఖరికి మాళవిక నాయర్ తో సరిపెట్టుకోవలసి వచ్చిందట. మాళవిక నాయర్ మంచి నటి. అందులో సందేహం…

అనుకున్నవి అన్నీ జరగవు. పాపం, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కు సరైన హీరోయిన్ దొరకలేదని బోగట్టా. ఆఖరికి మాళవిక నాయర్ తో సరిపెట్టుకోవలసి వచ్చిందట. మాళవిక నాయర్ మంచి నటి. అందులో సందేహం లేదు. కానీ నాని సినిమాలో తొలిసారి, నాగశౌర్యతో మలిసారి చేసిన తరువాత ఆ అమ్మాయిని దాదాపు మరిచిపోయారు.

అసలు ఆరంభం నుంచి ఎందరో హీరోయిన్లను ట్రయ్ చేసారు. ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను ప్రాజెక్టులోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆమె ఒకేలేదని గ్యాసిప్ లు వినిపించాయి. బహుశా రామ్ చరణ్ పక్కన తనను వద్దనుకున్నపుడు, ఆయన బావ పక్కన మాత్రం ఎందుకని అనుకుందేమో?

మెగా అల్లుడు అనగానే ఆ ఎంట్రీ గ్రాండ్ గా వుంటుందనుకుంటారు. అది సహజం. ఒక్క సెంథిల్ కుమార్ చాయాగ్రహణం అన్నది తప్పిస్తే అన్నీ చిన్న చిన్న పేర్లే. సంగీతం యోగేష్ అందిస్తున్నారు. ఈ పేరు కూడా కాస్త కొత్తదే. సినిమా డైరక్టర్ రాకేష్ శశి. ఎప్పుడో జతకలిసే లాంటి చిన్న ఫ్లాప్ సినిమా చేసాడు. ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ జ్యో అచ్యుతానందతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, రంగస్థలం సినిమాకు పనిచేసారు.

ఇదిలావుంటే, ఓపెనింగ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేద్దామని నిర్మాత సాయి కొర్రపాటి అనుకున్నట్లు బోగట్టా. కానీ మెగాస్టార్ చిరంజీవి, వీలయినంత సింపుల్ గా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. బావ సినిమా ఓపెనంగ్ కు చరణ్ కానీ, మిగిలిన మెగా ఫ్యామిలీ జనాలు కానీ ఎవ్వరూ హాజరు కాలేదు. రాజమౌళి, కీరవాణి లాంటి పెద్ద పేర్లు పక్కన పెడితే, ఓ చిన్న సినిమా ఓపెనింగ్ మాదిరిగా కానిచ్చేసారు.

ఇదంతా చూస్తుంటే వీలయినంతలో లో ప్రొఫైల్ సినిమాను తేవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే అప్పుడు తరువాత సినిమా హల్ చల్ చేయవచ్చు అనేమో?

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి