అవును… అనుష్క ప్రేమలో పడింది. అయితే తను మన అనుష్క కాదు. బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ. భారత క్రికెట్ జట్టు ఉప సారధి విరాట్ కొహ్లీతో అనుష్క శర్మ సన్నిహితంగా మెలుగుతోంది. ఇద్దరి మధ్యా వ్యవహారం చాలా దూరం పోయిందని బాలీవుడ్ కోడై కూస్తోంది.
వీరిద్దరూ కలసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయిందట. సహజీవనం చేసే స్థాయికి ఈ బంధం ఎదిగిందని బాలీవుడ్ మీడియా వేడి వేడి వార్తలు రాస్తోంది.
అయినా విరాట్ కోహ్లికి ఈ ప్రేమాయణాలు కొత్తేం కాదు. బ్రహ్మాచారి కదా.. ఆ అడ్వాంటేజ్ తీసుకొని చాలామంది అమ్మాయిలతో రాసుకుపూసుకొని తిరిగాడు. ఆ తరవాత మరో కొత్త అమ్మాయిని చూసుకొని మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టేవాడు. ఇప్పుడు అనుష్క శర్మ తగిలింది. ఈ బంధం ఎంత కాలమో..?