దర్శకుల్ని కెలికేసే హీరో ఏం చేస్తాడో?

ఏదో నాకు స్టార్‌డం ఉండబట్టి, ఉభయ రాష్ట్రాల్లో విపరీతమైన ప్రేక్షకుల క్రేజ్‌ ఉండబట్టి నేను హీరోగా చెలామణీ అవుతున్నాను గానీ.. నిజానికి నేను దర్శకుడు కావాల్సిన వ్యక్తిని.. అని బలంగా విశ్వసించే హీరో విశాల్‌.…

ఏదో నాకు స్టార్‌డం ఉండబట్టి, ఉభయ రాష్ట్రాల్లో విపరీతమైన ప్రేక్షకుల క్రేజ్‌ ఉండబట్టి నేను హీరోగా చెలామణీ అవుతున్నాను గానీ.. నిజానికి నేను దర్శకుడు కావాల్సిన వ్యక్తిని.. అని బలంగా విశ్వసించే హీరో విశాల్‌. ఏ సినిమా చేస్తున్నా సరే… దర్శకుడిని పనిలో మొత్తం కెలికేసి.. అది తనలోని అంతర్లీనంగా ఉన్న దర్శకత్వ ప్రతిభకు ప్రతిరూపంగా తయారయ్యేలా సినిమాలను మార్చేసుకుంటూ ఉండడంలో విశాల్‌కు తిరుగులేదని తమిళ ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. 

అలాంటి విశాల్‌ తన పేరిట తానే సొంత చిత్ర నిర్మాణ సంస్థను పెట్టుకున్నారు. ఇదివరకు కూడా ఆయనతో బయటి ప్రొడ్యూసర్స్‌ తీసినవి కూడా తక్కువే. వాళ్ల అన్నయ్య తీసేవాడంతే. ఇప్పుడు తన పేరుతో తనే పెట్టుకున్నాడు. అంతే తేడా! ఆ నిర్మాణ సంస్థ ద్వారా చేసిన పల్నాడు సినిమా థియేటర్లలోకి రాబోతోంది. దర్శకుడు సుశీంద్రన్‌ మీద సినిమా పరిశ్రమలో మంచి నమ్మకమే ఉంది. అయితే.. సుశీంద్రన్‌ పనిలో విశాల్‌ ఎంతమేరకు వేలు పెట్టి కెలికాడనేదానిమీదే చిత్ర విజయం ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నారు. 

గతంలో అర్జున్‌ దగ్గర ఒక సినిమాకు దర్వకత్వ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ఈ యువ హీరో సాధారణంగా అందరు దర్శకుల పనిలోనూ వేలు పెట్టేస్తుంటాడని… ఈ చిత్రం సంగతి విడుదల అయితే కానీ తెలియదని అంతా అనుకుంటున్నారు.