గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగ్‌??

తనయుడికి హిట్టిచ్చిన వారితో సినిమా చేయడం నాగార్జున ఆనవాయితీగా పెట్టుకొన్నాడేమో..?  నాగచైతన్య కి తడాఖాలాంటి హిట్‌ ఇచ్చి, మాస్లో నిలబెట్టిన డాలీని మళ్లీ పిలిచి. తనతో ఓ సినిమా చేసే ఛాన్స్‌ ఇచ్చాడు.  Advertisement…

తనయుడికి హిట్టిచ్చిన వారితో సినిమా చేయడం నాగార్జున ఆనవాయితీగా పెట్టుకొన్నాడేమో..?  నాగచైతన్య కి తడాఖాలాంటి హిట్‌ ఇచ్చి, మాస్లో నిలబెట్టిన డాలీని మళ్లీ పిలిచి. తనతో ఓ సినిమా చేసే ఛాన్స్‌ ఇచ్చాడు. 

ఇప్పుడు గౌతమ్‌ మీనన్‌ తో కూడా జట్టుకట్టబోతున్నాడని టాక్‌. చైతూకి ఏం మాయ చేశావె లాంటి సూపర్‌ లవ్‌ స్టోరీని ఇచ్చాడు గౌతమ్‌. ఆ అభిమానంతోనే గౌతమ్‌తో జట్టు కట్టడానికి నాగ్‌ రెడీ అయ్యాడట. గౌతమ్‌ మీనన్‌ సూర్య కోసం ధ్రువ నక్షత్రం అనే కథ రెడీ చేసుకొన్నాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సూర్య డ్రాప్‌ అయ్యాడు.

ఇప్పుడు అదే కథ నాగ్‌ దగ్గరకు వెళ్లినట్టు సమాచారమ్‌. అన్నీ కుదిరితే… గౌతమ్‌ దర్శకత్వంలో నాగ్‌ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరి మధ్యా కథా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.?