అనుష్క ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?

హీరోయిన్ అనుష్క మంచి నటి, మంచి అందం, అభినయం రెండూ కలిసిన నటి. అందులో సందేహం లేదు. కానీ బాహుబలి పుణ్యమా అని ఆమె ఫిజిక్ తాని చిత్తానికి అది మారిపోయింది. ఇప్పుడు వగచి…

హీరోయిన్ అనుష్క మంచి నటి, మంచి అందం, అభినయం రెండూ కలిసిన నటి. అందులో సందేహం లేదు. కానీ బాహుబలి పుణ్యమా అని ఆమె ఫిజిక్ తాని చిత్తానికి అది మారిపోయింది. ఇప్పుడు వగచి లాభం లేదు. దాన్ని సరిచేయడం అన్నది అంత సులువు కూడా కాదు. పైగా ఆమె వయస్సు కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి టైమ్ లో ఇక హీరోయిన్ గా అనుష్క ఇన్నింగ్స్ ముగిసినట్లే అనుకోవాలి.

ఆమె రేంజ్ కు పెద్ద హీరోల పక్కన చేయాలి. వారెవరు ఇప్పుడు అలా చేయడానికి రెడీగా లేరు. హీరోయిన్ ఒరియెంటెడ్ పాత్రలు చేయాలి. కానీ ఇప్పుడు అందుకు సమంత, కీర్తి సురేష్, నివేదాథామస్ లాంటి మంచి హీరోయిన్లు రెడీగా వున్నారు.

అందువల్ల అనుష్కనే ఓన్లీ చాయిస్ అన్న వ్యవహారం ఏమీ లేదు. చెప్పడానికి రెండు సినిమాలు ఓకె చేసానని, నిర్మాతలే చెబుతారని అనుష్క అంటున్నారు కానీ అవన్నీ మెటీరియలైజ్ అయ్యే వరకు అనుమానమే. 

ఫిజికల్ కరెక్షన్ కు రెండు కోట్లు?

పైగా అనుష్క కు వున్న ఫిజిక్ కు హీరోయిన్ పాత్రలు ఇప్పుడు సూట్ కావు. ఆమె డ్యాన్స్ లు చేసే స్టేజ్ దాటిపోయారు. కేవలం పెర్ ఫార్మెన్స్ కోసం తీసుకోవాలి. కానీ అందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం అనవసరం అన్నదే నిర్మాతల ఆలోచన కూడా.

నిశ్శబ్ధం సినిమాలో అనుష్క డిజిటల్ ఫిజికల్ కరెక్షన్ కు రెండు కోట్లకు కాస్త దగ్గరగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అంత ఖర్చుచేసినా, ఎంత చెక్కగలరో అంతే చెక్కగలరు. అంతకన్నా చెక్కడం అసాధ్యం. అందువల్ల కూడా అనుష్కకు ఇక చాన్స్ లు రావడం తక్కువే అనుకోవాలి. 

అయినా ఇన్నాళ్లు లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన తరువాత ఇక హ్యాపీగా రిైటర్ అయిపోవడమే. కొత్త అమ్మాయిలు వరుసగా వచ్చేస్తున్నారుగా.

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది