అనుష్క మళ్లీ ఫుల్ బిజీ

భాగమతి తరువాత మళ్లీ హీరోయిన్ అనుష్క వార్తల్లోకి రాలేదు. పెళ్లి గ్యాసిప్ లే తప్ప, సినిమా వార్తలు వినిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఒకటికాదు రెండుకాదు, మూడు సినిమాలు వినిపిస్తున్నాయి. దీంతో అనుష్క ఇప్పట్లో రిటైర్…

భాగమతి తరువాత మళ్లీ హీరోయిన్ అనుష్క వార్తల్లోకి రాలేదు. పెళ్లి గ్యాసిప్ లే తప్ప, సినిమా వార్తలు వినిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఒకటికాదు రెండుకాదు, మూడు సినిమాలు వినిపిస్తున్నాయి. దీంతో అనుష్క ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలో లేనట్లు క్లియర్ అవుతోంది. అనుష్క వయస్సు ఇప్పుడు 36ఏళ్లు. ఇంతకాలం హీరోయిన్ గా కొనసాగిన వాళ్లు తెలుగులో ఈ మధ్యకాలంలో లేరు. విజయశాంతి తరువాత అనుష్కనే ఈ వయస్సులో కూడా హీరోయిన్ గా చేస్తున్నది.

ఆ తరువాత నయనతార ప్లేస్ వుంటుంది. ఆమె 33ఏళ్లలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా వుంటే ప్రస్తుతం అనుష్క ఓ సినిమాను మాధవన్ హీరోగా ఒకే చేసింది. కొత్త దర్శకుడు హేమంత్ ఈ సినిమాను రూపొందిస్తారు. కోన కార్పొరేషన్, పీపుల్స్ మీడియా తదితరులు నిర్మాతలు.

అలాగే అనుష్క మరో సినిమాను ఆది పినిశెట్టి హీరోగా ఓకె చేసినట్ల ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇది కాకుండా ఆ మధ్య నా నువ్వే సినిమాను నిర్మించిన నిర్మాతలు ఓ మాంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసారు. వాళ్లు కూడా అనుష్కతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మొత్తంమీద చూస్తుంటే రమ్యకృష్ణ మాదిరిగా హీరోయిన్ నుంచి క్యారెక్టర్లకు కూడా మారి అనుష్క మరి కొన్నాళ్లు ఇన్నింగ్స్ కొనసాగించేలాగే వుంది.