దిల్ రాజు ఎంత జాగ్రత్త పడ్డా..

బొమ్మరిల్లు డేట్ అంటూ ఆగస్టు 9 నాటికి ఎవ్వరూ రాకుండా అడ్డంపడుతూ రెండు నెలలుగా కాపు కాసుకుంటూ వస్తున్నారు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఇదంతా శ్రీనివాసకళ్యాణం సినిమా కోసమే. ఆ సినిమా…

బొమ్మరిల్లు డేట్ అంటూ ఆగస్టు 9 నాటికి ఎవ్వరూ రాకుండా అడ్డంపడుతూ రెండు నెలలుగా కాపు కాసుకుంటూ వస్తున్నారు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఇదంతా శ్రీనివాసకళ్యాణం సినిమా కోసమే. ఆ సినిమా వచ్చిన వారం తరువాత గీతావారి గీతగోవిందం సినిమా వస్తుంటే కూడా ఓ వారం వెనక్కు వెళ్లమని రిక్వెస్ట్ చేసారు. ఇలా ఆ సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, పోటీ తప్పలేదు. 

అయితే పోటీ మనవైపు నుంచి రాలేదు. పక్కరాష్ట్రం నుంచి వచ్చింది. ఎప్పటి నుంచో వార్తల్లో వున్న కమల్ హాసన్ విశ్వరూపం సినిమా విడుదలకు ఇప్పుడు ముహుర్తం కుదిరింది. ఆగస్టు 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అంటే సరిగ్గా శ్రీనివాస కళ్యాణం విడుదలయిన మర్నాడు అన్నమాట. 

బిసి సెంటర్లలో ఎలావున్నా, మల్టీప్లెక్స్ లలో కమల్ సినిమా అంటే కాస్త హుషారు వుంటుంది. పైగా శ్రీనివాస కళ్యాణం కూడా మల్టీ ఫ్లెక్స్ సినిమానే. అయితే కొంతలో కొంత ఊరట ఏమిటంటే, ఆ సినిమాను ఇంకా తెలుగునాట ఎవ్వరూ తీసుకున్నట్లు లేదు. ఇప్పటికిప్పుడు తీసుకున్నా కూడా పబ్లిసిటీకి వున్న టైమ్ కూడా తక్కువే. మరి డైరక్ట్ విడుదల వుంటుందేమో చూడాలి.