అప్పుడు అజయ్‌.. ఇప్పుడు అక్షయ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా మాటల విషయంలో మహా ముదురు. ఎంచక్కా తమిళంలో మాట్లాడేస్తుంది.. ఎంచక్కా తెలుగులోనూ మాట్లాడేస్తుందామె. అంతే కాదు, ఏ హీరో గురించి మాట్లాడాల్సి వస్తే, ఆ హీరోలోని గుడ్‌ క్వాలిటీస్‌ గురించి…

మిల్కీ బ్యూటీ తమన్నా మాటల విషయంలో మహా ముదురు. ఎంచక్కా తమిళంలో మాట్లాడేస్తుంది.. ఎంచక్కా తెలుగులోనూ మాట్లాడేస్తుందామె. అంతే కాదు, ఏ హీరో గురించి మాట్లాడాల్సి వస్తే, ఆ హీరోలోని గుడ్‌ క్వాలిటీస్‌ గురించి తప్ప, ఎక్కడా ఎప్పుడూ ఎవరి గురించీ నెగెటివ్‌గా మాట్లాడదు తమన్నా. బహుశా అదే తమన్నాని హీరోయిన్‌గా ఈ స్థాయిలో నిలబెట్టిందేమో.

ఇక, ఈ మాటల ముదురు బాలీవుడ్‌లోనూ తన మాటకారితనాన్ని అద్భుతంగా ప్రదర్శించేస్తోంది. ఆ మధ్య ‘హిమ్మత్‌వాలా’ సినిమా టైమ్‌లో అజయ్‌ దేవగన్‌ తన ఫేవరెట్‌ యాక్టర్‌ అనీ, అతని సినిమాల్ని తానెంతో ఇష్టంగా చూస్తానని ‘మ్యాన్లీ హీరో’ అనీ అజయ్‌దేవగన్‌ని ఆకాశానికెత్తేసిన విషయం విదితమే. తాజాగా ఇప్పుడు అక్షయ్‌ జపం చేస్తోంది తమన్నా.

తన తాజా బాలీవుడ్‌ సినిమా ‘ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’లో అక్షయ్‌కుమార్‌తో చేస్తోన్న తమన్నా, అక్షయ్‌కుమార్‌ నటనకు తాను చిన్నప్పుడే ఫిదా అయిపోయాననీ, 11 ఏళ్ళ వయసులోనే అక్షయ్‌ అంటే అభిమానం ఏర్పడిరదనీ, ఇప్పుడు అక్షయ్‌కుమార్‌తో నటిస్తుండడం చాలా ఆనందంగా వుందనీ చెప్పుకొచ్చింది. అంతే కాదండోయ్‌, అటు అక్షయ్‌.. ఇటు తమన్నా.. ఇద్దరిదీ ఇంటిపేరు ‘భాటియా’యేనట. ఇది కూడా తమన్నానే చెప్పుకుంటూ మురిసిపోయింది.