కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రెండో సినిమా పూర్తి చేయడానికి బాగానే టైమ్ తీసుకున్నాడు. ఎన్టీఆర్‌తో రభస చేస్తున్న సంతోష్ తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇంకా రభస పూర్తి కాకముందే తన తదుపరి చిత్రం స్క్రిప్టు కూడా పూర్తి చేసేసాడు. దానికి టైటిల్ కూడా ఫిక్స్ చేసేసాడు.
తిక్క రేగితే అనే టైటిల్‌తో తన నెక్స్‌ట్ సినిమా తీయబోతున్నట్టు మీడియాకి సంతోష్ శ్రీనివాస్ చెప్పాడు. ఈ చిత్రంలో నటించే హీరో ఎవరు, నిర్మాత ఎవరు అనేది అతను ఇంకా చెప్పలేదు. అయితే అల్లు అర్జున్‌కి ఇతనో కథ వినిపించాడని, ఓకే అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయబోతున్నాడు. అంటే వచ్చే వేసవి వరకు అతను బిజీగానే ఉంటాడు. ఆల్రెడీ కథ సిద్ధం చేసుకున్న సంతోష్ శ్రీనివాస్ అంతవరకు వేచి చూస్తాడా లేక వేరే ఎవరితో అయినా తిక్క రేపుతాడా అనేది చూడాలి.