స్వామీజీ (?!) నిత్యానందులవారికి పురుషత్వ పరీక్షలు జరగనున్నాయి. ‘అసలు నేను మగాడ్నే కాదు..’ అంటూ గతంలో పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు నిత్యానంద. సినీ నటి రంజితతో సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఆ వ్యవహారాన్ని కాస్తా వీడియోకెక్కించారు కొందరు. ఆ కొందరు ఎవరో కాదు, నిత్యానంద ఆశ్రమంలోనివారే.. ఆయన పట్ల ఆగ్రహంతో రగిలిపోయినవారే.
‘మమ్మల్నీ లైంగిక వేధింపులకు గురిచేశారు..’ అంటూ నిత్యానందకు వ్యతిరేకంగా పెద్దయెత్తున మహిళలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు నిత్యానంద – రంజిత రాసలీలల వ్యవహారం తెరపైకొచ్చాక. ‘అబ్బే.. అది భగవంతుడు – భక్తురాలి మధ్య జరిగిన వ్యవహారం.. అందులో కామకేళి, సరససల్లాపాలేమీ లేవు.. సపర్యలు తప్ప..’ అని రంజిత వాదించింది, నిత్యానంద కూడా అదే మాట చెప్పాడు. తన ఆశ్రమంలో అందరూ ఆరోపిస్తున్నట్టుగా లైంగిక వేధింపులు జరగలేదని బుకాయించాడు.
చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్ద కథే. పోలీసుల నిత్యానంద ఆశ్రమంపై దాడులు చేయడం, నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం.. చాలా కథ నడిచింది. ప్రస్తుతం ‘నిత్యానంద మగాడా.? కాదా.?’ అన్న విషయం దగ్గర ఆగింది. న్యాయస్థానం ఆదేశాలతో ‘పురుషత్వ’ పరీక్షలు జరపనున్నారు. ‘ఇలాంటి పరీక్షలు కూడా వుంటాయా..’ అని చాలామందికి సందేహం వస్తోందిప్పుడు.
ఆశ్రమంలో భక్తులు తన్మయత్వంతో ఊగిపోతోంటే.. వారిని పిచ్చివాళ్ళగా మార్చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద, ‘మగాడే’ అని పరీక్షలు తేలిపోతుందని నిత్యానంద బాధితులు ధీమాగా చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే నిత్యానంద బండారం బయటపడిపోతుంది.