యంగ్ హీరో, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లలో ఒకరైన నితిన్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. సినిమా ఫ్యామిలీలతో సంబంధం లేని, సంప్రదాయ రెడ్డి కుటుంబనానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. వధువు డాక్టర్ అని తెలుస్తోంది. మిగిలిన వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలా వుంటే నితిన్ కుటుంబం ఈ వివాహాన్ని దుబాయ్ లో చేయాలని అనుకుంటోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిన్ తండ్రి సుధాకరరెడ్డి ఈ విషయాన్ని మరీ ఎక్కువ హడావుడి చేయకుండా, తమ కుటుంబ వ్యవహారంలా వుంచాలనుకుంటున్నారు. అందుకే వధువు వివరాలు ఇంకా బయటకు రాకుండా వుంచారు.
నితిన్ గతంలో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారని, డేటింగ్ లో వున్నారని గ్యాసిప్ లు వచ్చాయి. అయితే గత కొంత కాలంగా ఇవేవీ వినిపించడం మానేసాయి. నితిన్ కూడా తన కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టారు. ప్రస్తుతం రష్మిక తో కలిసి భీష్మ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా వుంది. ఈ రెండూ కాక చంద్రశేఖర్ యేలేటి సినిమా కూడా షూటింగ్ లో వుంది. మరో పక్క అంథాదూన్ రీమేక్ కు రెడీగా వుంది.