‘అరవింద’ కు 40 కోట్ల ప్రాఫిట్?

పెద్ద హీరోల సినిమాలు అంటే వందకోట్లకు పైమాటే అన్నది ఇప్పడు టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్. అయితే వందకోట్లు దాటిన సినిమాలు అన్నీ భయంకరమైన ప్రాఫిట్ లు కావచ్చు, నార్మల్ ప్రాఫిట్ లు చేసుకున్నవి…

పెద్ద హీరోల సినిమాలు అంటే వందకోట్లకు పైమాటే అన్నది ఇప్పడు టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్. అయితే వందకోట్లు దాటిన సినిమాలు అన్నీ భయంకరమైన ప్రాఫిట్ లు కావచ్చు, నార్మల్ ప్రాఫిట్ లు చేసుకున్నవి తక్కువ. నష్టాలు మూటకట్టుకున్నవే ఎక్కువ. భరత్ అనే నేను, రంగస్థలం మాత్రమే లాభాలు కళ్లచూసాయి.

స్పైడర్, అజ్ఞాతవాసి, నాపేరు సూర్యకి నష్టాలే మిగిలాయి. కానీ పెద్ద హీరోల సినిమాలు అంటే వందకోట్లు సినిమాలు అన్నది ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే పెద్ద హీరోలు అంతా 15 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. డైరక్టర్లు కూడా అదేబాటన వెళ్తున్నారు. దాంతో స్టార్ అండ్ టెక్నికల్ కాస్ట్ నే 60 నుంచి 70 కోట్ల వరకు అవుతోంది. మేకింగ్ కు ముఫై, నలభై అవుతోంది.

దీనికితోడు మార్కెట్ కూడా అలాగే వుంది. డిజిటల్, శాటిలైట్ ఇతరత్రా ఆదాయం పెరిగింది. థియేటర్ హక్కుల ఆదాయం కూడా ఇప్పడు బాగానే వుంది. ఇలాంటి నేపథ్యంలో అరవింద సమేత వీరరాఘవ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాకు నిర్మాతలకు నలభై కోట్లకు పైగానే లాభం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.

సినిమా నిర్మాణానికి 82కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. దీనికి వడ్డీలు, ప్రచారం ఖర్చులు, విడుదల ఖర్చులు అదనం. అంటే దాదాపు 92కోట్లు అనుకోవచ్చు. సినిమా థియేటర్ హక్కుల రూపేణా 93కోట్ల వరకు వచ్చాయి. అంటే అక్కడికి ఖర్చు.. ఆదాయం సరిపోయింది.

అయితే శాటిలైట్, డిజిటల్, ఇంకా ఇతరత్రా ఆధాయాలు అన్నీకలిపి 40 కోట్లకు పైగానే వచ్చినట్లు తెలుస్తోంది. 48కోట్లు అని వినిపిస్తోంది కానీ, కన్ ఫర్మేషన్ లేదు. పోనీ 40 కోట్లే అనుకున్నా, అదంతా లాభంగా మిగిలినట్లే.

అజ్ఞాత వాసి విషయంలో ఫస్ట్ టైమ్ హారిక హాసిని సంస్థ దెబ్బతింది. డబ్బులు వెంటనే వెనక్కు కట్టింది. ఆ తరువాత వచ్చిన శైలజారెడ్డి యావరేజ్ అయినా కూడా మంచి లాభాలు చేసుకుంది. ఇప్పుడు అరవిందకు కూడా మంచి లాభాలు వచ్చాయి.

అజ్ఞాతవాసి విషయంలో నిర్మాత చినబాబు వ్యవహరించిన తీరు చూసిన బయ్యర్లు మారు మాట్లాకుండా చెప్పిన రేట్లకు అరవింద సినిమాను కొన్నారు. సో టోటల్ గా ఈ ఏడాదికి ఇప్పటికి హారిక హాసిని రెండు సినిమాల మీద 50 కోట్ల వరకు లాభం కళ్లచూసినట్లే