అరవింద సమేత.. విశాఖ సంగతేమిటి?

అరవింద సమేత వీరరాఘవ. ఈ దసరా టార్గెట్ గా రెడీ అవుతున్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా. ఈ సినిమా అమ్మకాలు ఈ మధ్యనే మొదలయ్యాయి. నలభైకోట్ల రేషియోలో ఆంధ్ర రైట్స్ అమ్మడం ప్రారంభించారు. నలభైకోట్ల రేషియో…

అరవింద సమేత వీరరాఘవ. ఈ దసరా టార్గెట్ గా రెడీ అవుతున్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా. ఈ సినిమా అమ్మకాలు ఈ మధ్యనే మొదలయ్యాయి. నలభైకోట్ల రేషియోలో ఆంధ్ర రైట్స్ అమ్మడం ప్రారంభించారు. నలభైకోట్ల రేషియో అని చెబుతున్నారు కానీ, వాస్తవానికి 38 నుంచి 39కోట్ల రేషియోలో ఏరియాను బట్టి ఇస్తున్నారు. నెల్లూరు అయితే 38కోట్ల రేషియోలోనే లెక్క పెట్టి ఇచ్చారని వినికిడి. అలాగే వెస్ట్ కూడా. ఈస్ట్ 39 లెక్కన కాలుక్యులేట్ చేసారు.

అయితే ఆంధ్రలో కీలకమైన ఉత్తరాంధ్ర సంగతేమిటి? ఈస్ట్ వెస్ట్, నెల్లూరు ఫైనలైజ్ చేసారు మరి వైజాగ్ ఎందుకు చేయలేదు? ఓవర్ సీస్ మాదిరిగానే విశాఖలో కూడా చిన్న చిక్కుముడి వున్నట్లు తెలుస్తోంది. 
అజ్ఞాతవాసి వైజాగ్ ఏరియాను మంత్రి గంటా అల్లుడు ప్రశాంత్ కొన్నారు. ఆ సినిమాకు ఆయనకు అయిదుకోట్లు లాస్ తప్పలేదు. అందులో సగం అంటే రెండున్నర కోట్లు నిర్మాత చినబాబు భర్తీ చేసారు. అంటే రెండున్నర కోట్ల పోయాయి. అందువల్ల అరవింద సమేత సినిమాను తమకు ఇవ్వమని ప్రశాంత్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

కానీ అదే వైజాగ్ కు అరవింత సమేత ప్లస్ శైలజరెడ్డి కలిసి 11కోట్లకు పైగా మొత్తానికి బేరం వేరే వాళ్లతో సెటిల్ అయినట్లు వినికిడి. అయితే ఎవరికీ కన్ ఫర్మ్ కాలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కన్ ఫర్మ్ అయిపోయిందని వైజాగ్ సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయిపోతే మరెందకు బయట పెట్టడంలేదు అన్నది ప్రశ్న. అజ్ఞాతవాసి వ్యవహారం దీనివెనుక వుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను వైజాగ్ ఏరియాకు తొమ్మిది కోట్లకు కాస్త తక్కువగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ అరవింద సమేత సినిమాను తొమ్మిదిన్నర కోట్లకు కాస్త అటుగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే బయ్యర్ల పోటీవుంది. అజ్ఞాతవాసి బయ్యర్ కు ఇస్తే కాస్త తగ్గించాల్సి వస్తుందేమో? తెలియదు?