తొలిసారి ఫర్ ఏ ఛేంజ్, హారిక హాసిని వారి సినిమా అడియో ఫంక్షన్ లైవ్ ఎన్టీవీ, టీవీ 9ల్లో రాబోతోంది. హారిక హాసిని సినిమా లైవ్ లు ఎక్కువగా టీవీ5 చానెల్ లోనే వుంటాయి. ఆ చానెల్ ప్రతినిధులతో హారిక హాసినికి వున్న అనుబంధం దానికి కారణం కావచ్చు. కానీ అజ్ఞాతవాసి టైమ్ లో టీవీ9, ఎన్టీవీ ఈ విషయంలో కాస్త అలిగాయని గుసగుసలు వినిపించాయి.
మరి ఈసారి ఏమయిందో? అనవసరపు వివాదం అనుకున్నారో కానీ లైవ్ ను టీవీ 9కు, ఎన్టీవీకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ 5ను పక్కన పెట్టినట్లు వినికిడి. మరి ఈ నిర్ణయం హారిక హాసిని జనాలతో, ఎన్టీఆర్ దో తెలియదు. ఎన్టీఆర్ కలుగ చేసుకుని టీవీ 9, ఎన్టీవీలకు లైవ్ ఇచ్చేలా చేసారని కూడా ఓ వెర్షన్ వినిపిస్తోంది.
అలాకాదని, హారిక హాసిని జనాలు ప్రతి ఒక్కరితో మాంచి రాపో వుండేలా చూసుకోవాలని అనుకుంటోందని, ఈసారి ప్రకటనలు ప్రతి చానెల్ కు ఇవ్వాలని కూడా డిసైడ్ అయిందని తెలుస్తోంది. అందుకే టీవీ 5కు కాకుండా టీవీ 9కు, ఎన్టీవీకి ఇచ్చారని తెలుస్తోంది.
నాలుగు షోలు, నాలుగు స్పీచ్ లు
అరవింద అడియో ఫంక్షన్ డిటైల్స్ ఎక్స్ క్లూజివ్ గా తెలిసాయి. రెండుగంటల పాటు సాగే ఈ ఫంక్షన్ చాలా క్లాస్ గా జరుగుతుంది. దలేర్ మహెంది, శివమణి, ఆర్మాన్ మాలిక్, కైలాష్ ఖేర్ లైవ్ షో లు వుంటాయి. సిరివెన్నెల, రామజోగయ్య, ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల స్పీచ్ లు స్పెషల్ గా వుంటాయి. మెడ్లీలు, ఎవీలు వుండవు. టోటల్ గా ఫంక్షన్ మొత్తం ఫీల్ గుడ్ ఫంక్షన్ గా వుంటుదని తెలుస్తోంది.