సాధారణంగా ఫామ్ లో వున్న హీరో అంటే హిట్ లు, ఫ్లాపుల సంగతి ఎలా వున్నా, డబ్బులకు పెద్దగా లోటు వుండదు. కానీ తెలుగు, తమిళ భాషల్లో మంచి పాపులారిటీ వున్న హీరో ఒకరు కాస్త గట్టి ఆర్థిక చిక్కుల్లోనే వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హీరో దాదాపు అన్నీ స్వంత సినిమాలే చేసుకోవడం, వాటిల్లో హిట్ లు తక్కువ వుండడంతో చాలావరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వినిపిస్తోంది.
ఆ మధ్య సదరు హీరో నిర్మించిన ఓ సినిమా మంచి హిట్ అయింది. కానీ ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఆ టైమ్ లో ఎడాపెడా అడ్వాన్స్ లు తీసేసుకున్నట్లు తెలుస్తోంది. అలా ఇచ్చిన వారిలో భోగవిల్లి ప్రసాద్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ వంటి పెద్ద సంస్థలు కూడా వున్నాయని వినికిడి. ఒక వ్యక్తి అయితే ఏకంగా తొమ్మిది కోట్ల సింగిల్ పేమెంట్ ఇచ్చేసారని తెలుస్తోంది.
కానీ ఈ సినిమాలు ఏవీ స్టార్ట్ కాలేదు. మరోపక్క అదే హీరో సినిమా మరోటి రాబోతోంది. ఈ సినిమాకు చాలా ప్రతి బంధకాలు వున్నాయని, ఆర్థిక లావాదేవీలు అన్నీ క్లియర్ చేసుకుని రావడం అంటే అంత సులువు కాదనీ వినిపిస్తోంది. పక్కభాషలో ఈ సినిమాకు ల్యాబ్ లెటర్లు, ఫైనాన్స్ వ్యవహారాలు వున్నాయని టాక్.
గత సినిమా కోసం చేసినవి ఈ సినిమా మీదకు వచ్చాయని, మరి ఈ సినిమా విడుదలకు ఏం చేస్తారో? అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క అదే సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించి కూడా చిన్న చిన్న చిక్కులు చాంబర్ మెట్లు ఎక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.