అసలే కరోనా కాలం. వార్తలకు మరీ కరువు కాలం. అందుకే ఏదో ఒకటి పుట్టించాల్సిందే కానీ ఏదీ పుట్టదు. అలా పుట్టిన వారే కృతిశెట్టిని హీరో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా అడిగారన్నది.
ఇంకా ఆమె ఏ సంగతి చెప్పలేదన్నది. కానీ అసలు నిజం వేరు. అసలు సంగతి వేరు. సాయి ధరమ్ తేజ్-బోగవిల్లి ప్రసాద్ సినిమా ప్రతిపాదన వేళకు ఉప్పెన ఇంకా విడుదల కాలేదు.
అప్పటికి ఇంకా కృతికి అంత క్రేజ్ కూడా రాలేదు. అలాంటి టైమ్ లోనే కృతి పేరు పరిశీలనకు వచ్చింది. వన్ మినిట్ కూడా ఆలోచించకుండా సాయిధరమ్ తేజ్ వీటో చేసేసారు.
తమ్ముడి పక్కన హీరోయిన్ గా చేస్తున్న అమ్మాయితో తను చేయడం అంత బాగోదు అనే ఆలోచన తప్ప ఇందులో మరేమీ లేదు. అప్పటి నుంచి ఈ సినిమా కు హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు. అదే వేట కొనసాగుతోంది. అదీ విషయం.