సంక్రాంతి కానుకగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను బుల్లితెర వీక్షకులు కూడా తిరస్కరించారు. జెమినీ టీవీలో తాజాగా టెలికాస్ట్ చేసిన ఈ సినిమాకు ఓ మోస్తరు రేటింగ్ మాత్రమే వచ్చింది.
ఈనెల 16న జెమినీ ఛానెల్ లో అల్లుడు అదుర్స్ సినిమాను ప్రసారం చేస్తే, కేవలం కేవలం 6.9 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఓ కొత్త సినిమాకు బుల్లితెరపై ఈ రేటింగ్ అంటే తక్కువే. కాకపోతే హీరో బెల్లంకొండ రేంజ్ కు మాత్రం ఈ టీఆర్పీ ఓకే.
ఈ ఏడాది సంక్రాంతికి రెడ్, క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాలు రిలీజైతే వీటిలో క్రాక్ సినిమా హిట్ అనిపించుకోగా.. విడుదలైన 4 సినిమాల్లో అల్లుడు అదుర్స్ చెత్త అనిపించుకుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చొప్పించిన కామెడీ బొత్తిగా గిట్టుబాటు కాలేదు. ఇప్పుడీ కామెడీ బుల్లితెరపై కూడా వర్కవుట్ కాలేదు.
నిజానికి ఇలాంటి ఫ్లాప్ సినిమాల్ని వీలైనంత త్వరగా టెలికాస్ట్ చేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిస్తాయి ఛానెల్స్. జీ తెలుగు, స్టార్ మా ఛానెల్స్ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఒక్క జెమినీ ఛానెల్ మాత్రమే ఫ్లాప్ అయిన సినిమాల్ని కూడా అట్టిపెట్టుకొని, ఆణిముత్యాల టైపులో ఆలస్యంగా టెలికాస్ట్ చేస్తుంటుంది. వాళ్ల పద్ధతి వాళ్లది.