అశ్వనీదత్..అంటే మెగా ప్రొడ్యూసర్..సీనియర్ ఎన్టీఆర్ తో ఆరంభించి మెగాస్టార్ మీదుగా జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎందరితోనో భారీ సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్. టాలీవుడ్ లో ఆయనో సంచలనం. ఆయనే ఇప్పుడు అమరావతిలో కూడా సంచలనం కాబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే రాజధాని అమరావతి కీలక ప్రాంతంలో 150 ఎకరాలు ఆయనే లాండ్ పూలింగ్ కింద ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు ఆయనకు రాజధానిలో బిట్లు బిట్లుగా స్థలాలు లభిస్తాయి..పరిహారం సంగతి సరే. అంటే భవిష్యత్ లో అమరావతిలో సినిమా నిర్మాణాలు ఏవి చేపట్టాలన్నా అశ్వనీదత్ కు స్థలాలు అందుబాటులో వుంటాయన్నమాట.
సో..ఇప్పుడు అశ్వనీ దత్ నే రాజధానికి సంబంధించినంత వరకు టాలీవుడ్ లో బిగ్ అసెట్ హోల్డర్ అన్నమాట. దీంతో కొంతమంది టాలీవుడ్ పెద్దలు ఇప్పటి నుంచే అశ్వనీదత్ తో కలిసి అమరావతిలో కొన్ని సినిమా నిర్మాణల గురించి డిస్కషన్లు ప్రారంభించినట్లు వినికిడి.