Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అటు మహేష్.. ఇటు అఖిల్.. మధ్యలో..

అటు మహేష్.. ఇటు అఖిల్.. మధ్యలో..

రష్మిక మడొన్నా టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోతోంది. ఛలో, గీత గోవిందం తరువాత రష్మిక అంటే ప్రతి హీరో ఓకే అంటున్నారు. ఈ సమ్మర్ కు విజయ్ దేవరకొండతో మళ్లీ మరోసారి డియర్ కామ్రేడ్ అనబోతోంది. నితిన్ తో భీష్మ సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా చేయబోతోంది. లేటెస్ట్ గా గీతా సంస్థలో మరో సినిమాకు ఓకే చెప్పేసింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ హీరోగా గీతాసంస్థ నిర్మించే సినిమాలో రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు.

దీంతో ఇప్పుడు రష్మిక చేతిలో నాలుగు తెలుగు సినిమాలు రెడీగా వున్నాయి. ఇవికాక అల్లుఅర్జున్ సరసన కూడా రష్మిక నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్, రాశీల టైమ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఎఫ్ 2 క్లిక్ అయినా మెహరీన్ ఎందుకో ముందుకు వెళ్లలేకపోతోంది.

ఇలాంటి టైమ్ లో రష్మిక అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?