అటు మెగాస్టార్..ఇటు పవర్ స్టార్?

మహేష్ బాబు – అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ఫంక్షన్ జనవరి 5న జరగబోతోంది. ఇటీవల కొంత కాలంగా మహేష్ బాబు తన సినిమాల…

మహేష్ బాబు – అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ఫంక్షన్ జనవరి 5న జరగబోతోంది. ఇటీవల కొంత కాలంగా మహేష్ బాబు తన సినిమాల ఫంక్షన్ లకు వేరే హీరోలను ఆహ్వానించి, మాంచి క్రేజ్ తీసుకువస్తున్నారు. ఓసారి ఎన్టీఆర్ ను పిలిచారు. మరోసారి విజయ్ దేవరకొండ-వెంకటేష్ లను పిలిచారు. ఇలా మహేష్ కు తోడుగా క్రేజ్ వున్న వేరే స్టార్ లు రావడంతో ఫంక్షన్ లు సూపర్ సక్సెస్ అవుతున్నాయి.

ఈసారి ఫంక్షన్ కు కూడా ఎవరో ఒక పెద్ద స్టార్ ను పిలవడం పక్కా అని కొంతకాలంగా వార్తలు వినవస్తున్నాయి. ఆ స్టార్ మెగాస్టార్ చిరంజీవే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.  మెగాస్టార్ ఇటీవల తరచు పబ్లిక్ ఫంక్షన్ లకు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు వస్తారని అనుకోవడంలో కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. రామ్ చరణ్ పేరు కూడా వినిపిస్తోంది కానీ, ఎక్కువ మెగాస్టార్ పేరే ఇప్పుడు బయటకు వచ్చింది. 

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు మెగా హీరో బన్నీకి-మహేష్ బాబుకు మధ్య ఎలా వున్నా, ఫ్యాన్స్ కు మధ్య గట్టి పోటీ నడుస్తోంది. రెండు సినిమాలు ఒకరోజు తేడాతో విడుదల అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తనకు ఆప్తుడు అయిన అల్లు అరవింద్ కొడుకు సినిమాకు పోటీగా వస్తున్న సినిమా ఫంక్షన్ కు మెగాస్టార్ అతిధిగా వస్తారా? అన్నది అనుమానం. రామ్ చరణ్ అయినా బన్నీ సినిమాకు పోటీగా వస్తున్న సినిమా ఫంక్షన్ కు వస్తారా? అన్నది అనుమానం. 

ఇలా రావడం అన్నది వారి సహృదయాన్ని చాటడం వరకు ఓకె. కానీ ఫ్యాన్స్ లో రియాక్షన్ ఎలా వుంటుంది? అన్నది పాయింట్. మెగాస్టార్ కనుక మహేష్ ఫంక్షన్ కు వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, ఎన్టీఆర్ కానీ బన్నీ ఫంక్షన్ కు గెస్ట్ లుగా వెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది.