బాబు మీద దాడి చేశారుగా…!!

చంద్రబాబు మీద జడివానే కురుస్తోందిపుడు. ఆయన ఒకనాటి మిత్రులు సైతం బాబు రాజకీయ‌ పోకడలను చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాల్లో ముచ్చటగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబితే కడుపు…

చంద్రబాబు మీద జడివానే కురుస్తోందిపుడు. ఆయన ఒకనాటి మిత్రులు సైతం బాబు రాజకీయ‌ పోకడలను చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాల్లో ముచ్చటగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబితే కడుపు మంట ఎందుకు బాబూ అంటూ  టీడీపీ మాజీ తమ్ముడు, సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఒక రేంజిలో వేసుకున్నారు.

ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధి చెందవద్దా బాబూ అంటూ గట్టిగానే తగులుకున్నారు. తన అస్మదీయుల కోసం అమరావతి రాజధానిని సమర్పించి గ్రాఫిక్స్ మాయాజాలంతో భ్రమరావతిని రాజధానిగా జనాలకు చూపించి మభ్యపెట్టారని దాడి వీరభద్రరావు హాట్ కామెంట్స్ చేశారు.

అమాయక రైతుల నుంచి సేకరించిన భూములను తన బంధువులు, అనుచరులకు పెద్ద ఎత్తున కట్టబెట్టిన బాబు జగన్ని విమర్శించే అర్హత లేదని కూడా అన్నారు. అంతేనా మూడు రాజధానులూ తిరుగుతారా అని జగన్ని  వెటకారమాడతారా.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో కూడా తెలియదా నీకు బాబూ అంటూ గట్టి పంచులే పేల్చారు.

దేశంలోనే దమ్మున్న నాయకుడు జగన్మోహనరెడ్డి అని, అందుకే ఆయన మూడు వ్యవస్థలను మూడు చోట్ల ఏర్పాటు చేయాలనుకోవడం ద్వారా విప్లవాత్మకమైన నిర్ణయానికి తెరతీశారని దాడి అన్నారు. ఇది రాష్త్ర అభివ్రుధ్ధికి బాటలు వేసే వినూత్న ఆలోచన జగన్ చేశారని  బాబుకు ఆయన బ్యాచ్ కి ఇది  అసలు అర్ధం కాదులే మరి అంటూ దాడి ఎకసెక్కమే ఆడారుగా.

ఈ రోజు జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని రేపటి రోజున దేశమంతా ఆచరిస్తారని కూడా దాడి చెప్పుకొచ్చారు. అన్ని వ్యవస్థలూ, అధికారాలూ ఒకే చోట కేంద్రీకరించడం ద్వారా చంద్రబాబు ప్రాంతీయ వైషమ్యాలు చెలరేగేలా చేస్తే జగన్ దాని చక్కదిద్దుతున్నారని, ఇది అంతా మెచ్చుకోవాల్సిన విషయమని ఈ సీనియర్ నాయకుడు అంటున్నారు.

ఇక పవన్ని సైతం విడిచిపెట్టలేదు సరికదా ధైర్యంగా సొంత పార్టీ అధినేతగా నిర్ణయాలు తీసుకోలేవా జనసేనానీ  అంటూ బాగానే సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుజాడల్లో నడవడం పవన్ మానుకుంటే మంచిదని కూడా సలహా ఇచ్చారు. మొత్తానికి ఈ సీనియర్ నేత తనదైన శైలిలో  బాబుకు బాగానే నాలుగు  అంటించేశారు.