సన్నాఫ్ సత్యమూర్తి విడుదల వెనక్కు వెళ్లినట్లే. దాంతో ఆ తేదీని ఖాళీగా ఎందుకు వదుల్తారు టాలీవుడ్ జనాలు. అందుకే అవును 2 సినిమాను అక్కడకు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అన్ని విధాల విడుదలకు సిద్దమై చాలా కాలమైంది.
అయితే గోపాల గోపాల విడుదల, ఆ పై రామానాయుడి మృతి వంటి కారణాలు దీన్ని వెనక్కు నెట్టాయి. ఈ సినిమాకు వారం రోజుల సమయం చాలు. చాలా కాంపాక్ట్ బడ్జెట్ లో తీసారు. శాటిలైట్ హక్కులే మూడు వంతుల సొమ్ము రికవరీ చేస్తాయి.
అందుకే సమ్మర్ తొలి వారంలో దీన్ని వదలాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాదంటే, మళ్లీ మరో నెల, రెండు నెలల వరకు సరైన స్లాట్ దొరకదు కదా. ఈ సినిమాకు రవిబాబు దర్శకుడు. సురేష్ బాబు నిర్మాత.