సన్నాఫ్ సత్యమూర్తి విశేషాలు మరికొన్ని బయటకు వచ్చాయి.
ప్రకాష్ రాజ్ దివాళా తీయడం అన్నది వాస్తవమే. అయితే అతన్ని గెస్ట్ రోల్ కింద వాడారట. చనిపోయే స్టేజ్ కు చేరుకుని, సినిమా ఆరంభంలోనూ, చివర్న కనిపిస్తాడని కొత్త టాక్.
నిత్య మీనన్ టామ్ బాయ్ గా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుందట. ఆమెను పెళ్లి చేసుకోమని ఉపేంద్ర కండిషన్ పెట్టడం, ఆమెను కాకుండా సమంతను చేసుకునేందుకు అల్లు అర్జున్ కిందా మీదా పడి డ్రామా నడపడం, ఆ డ్రామాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం పాత్రలు కావడం మరో సంగతి
కాస్త డబ్బులు వస్తాయి కదా అని ఓ ఫ్రెండ్ సలహాతో అల్లు అర్జున్ ఓ పెళ్లి మేనేజ్ మెంట్ కు ఒప్పుకుంటే, తీరా చూస్తే, ఆ పెళ్లి ఎవరితో కాదు..బన్నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆదాశర్మదవడం ట్విస్ట్.
సెకండాఫ్ లో సినిమా కాస్త శ్రీను వైట్ల ఫార్ములాలో నడుస్తుదని వినికిడి. అంటే ఉపేంద్ర ఇంట్లో హీరో దాగుడుమూతలాట అన్నమాట.
ఉపేంద్ర దగ్గర హీరో తండ్రి తాలూకా ఆస్తి పత్రాలు వుండడం, వాటిని సంపాదించేందుకు నిత్యతో పెళ్లికి ఓకె అనడం, ఆపై డ్రామా ప్రారంభించి, చివరకు సమంతను చేసుకోవడం సెకండాఫ్ లైన్ అంట.
అసలు ఉపేంద్ర దగ్గర ప్రకాష్ రాజ్ ఆస్తి పత్రాలు ఎందుకు వున్నాయన్నది సస్సెన్స్.
ఇలా వచ్చిన విశేషాలు ఫ్యాన్స్ నడుమ చక్కర్లు కొడుతున్నాయి..నిజమెంతో సినిమా విడుదలయ్యాకే తెలిసేది.