'మాతో బాగా ఆడావు.. నువ్వు సెమిఫైనల్ లో కూడా బాగా ఆడాలను కోరుకొంటున్నా..'' అంటూ షేన్ వాట్సన్ ను విష్ చేశాడు పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్.
'ఫైనల్ కు ఆస్ట్రేలియా రావాలని కోరుకొంటున్నాం..'' అని వ్యాఖ్యానించాడు ఇప్పటికే ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్ జట్టు ఆటగాడు ఇలియాట్.
ఇక బంగ్లాదేశ్ వాళ్లు అయితే ఆసీస్ ఇండియాను చిత్తుగా ఓడించాలని కోరుకొంటున్నారు. క్వార్టర్స్ లో ఇండియా తమను మోసం చేసి గెలిచిందని బలంగానమ్ముతూ.. అందరూ దాన్నే నమ్మాలని కోరుకొంటున్న బంగ్లాదేశీయులు ఆ కసితో ఇండియా ఓడిపోతే చూడాలని కోరుకొంటున్నారు!
ఇలా ఆస్ట్రేలియా తో ఎలాంటి అనుబంధం లేకపోయినా.. రేపు ఆసీస్ గెలవాలని కోరుకొంటున్న వారు ఎంతో మంది కనిపిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ వారి మోకా యాడ్ లో చూపించినట్టుగా.. ఇప్పుడు ప్రపంచకప్ లో ఇండియా ఒకవైపు అందరూ మరోవైపు కనిపిస్తున్నారు. తమ మాటలతోనూ.. చేతల ద్వారా ఇండియా ఓటమిని ఆకాంక్షిస్తున్నారు.
అయితే ఇలాంటి వీల్ చైర్ మాటలతో టీమిండియాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. తాము డిఫెండింగ్ చాంపియన్లం.. గత ప్రపంచకప్ లో కూడా ఆసీస్ ను ఓడించి ప్రపంచకప్ ను గెలిచామన్న విషయాన్ని గుర్తుంచుకొని ధాటిగా ఆడితే ధోనీ సేనకు తిరుగులేకపోవచ్చు.