మెగా క్యాంప్ నటుడు నాగేంద్రబాబు మరో సారి బాహాటంగా ముందుకు వచ్చి, జయసుధ ప్యానెల్ ను కాదని, రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ కే మద్దతు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఏమయినా తను మాట తప్పనని అన్నారు. మరో పక్క చిరంజీవి మద్దతు జయసుధకే అని తెరచాటు ప్రచారం సాగుతోంది. కానీ ఆయన ఓపెన్ గా ఏమాట చెప్పలేదు.
పవన్ కూడా అంతే, మెగా క్యాంప్ నిర్ణయంపై ఆధార పడి చాలా ఓట్లు వుంటాయి. వారి క్యాంప్ లో ఆరేడు ఓట్లే వుండొచ్చు కానీ, మెగా స్టార్ మొగ్గు రాజేంద్రుడివైపే అని స్పష్టమైతే మాత్రం చాలా ఓట్లలో మార్పు వస్తుంది. అందునా ఇప్పుడు జయసుధ వెనకు కీలక పాత్ర వహిస్తున్నది ఒక సామాజికవర్గమే.
ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి సరైన నిర్ణయం వెలువడితే, సినిమా రంగంలో కీలకపాత్ర వహిస్తున్న మరో సామాజికవర్గం ఓట్లలో తేడా వచ్చేస్తుంది. కానీ పైకి ఏమీ మాట్లాడకుండానే రాజకీయాలు చేయడం చిరు, పవన్ ల స్టయిల్ కాబట్టి, ఇప్పుడు ఏమీ ప్రకటించకపోవచ్చు.