23న రుద్రమదేవి?

దర్శకుడు గుణశేఖర్ తన సర్వ శక్తులు కూడ దీసుకుని నిర్మిస్తున్న సినిమా రుద్రమదేవి. సినిమా పూర్తయింది. దాదాపు అన్ని వ్యవహారాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖ, వరంగల్ లో అడియో ఫంక్షన్లు…

దర్శకుడు గుణశేఖర్ తన సర్వ శక్తులు కూడ దీసుకుని నిర్మిస్తున్న సినిమా రుద్రమదేవి. సినిమా పూర్తయింది. దాదాపు అన్ని వ్యవహారాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖ, వరంగల్ లో అడియో ఫంక్షన్లు జరుపుకుంది.అనుష్క, అల్లు అర్జున్, రానా, కృష్ణం రాజు, నిత్య మీనన్ తదితర భారీ తారాగణం వుంది ఈ సినిమాలో వేసవిలో వస్తుందని ప్రకటించారు కానీ ఇంతవరకు తేదీ ప్రకటించలేదు. 

ఏప్రిల్ 23న విడుదల చేయాలన్నది గుణశేఖర్ సంకల్పంగా తెలుస్తోంది. మే 15న బాహుబలి వస్తొంది. ఏప్రిల్ 9న సన్నాఫ్ సత్యమూర్తి వుంది. మే 1న లయన్ రావచ్చు. ఇక మిగిలిన తేదీ ఇదొక్కటే. అందుకే ఏప్రిల్ 23 వ తేదీని రుద్రమదేవి విడుదలకు ముహుర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఏప్రిల్ లో ఈ సినిమా కనుక విడుదలైతే, బన్నీ సినిమాలు రెండు ఒకే నెలలో విడుదలయిన రికార్డు వుంటుంది. అలాగే నిత్య మీనన్ కు కూడా.