Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అయిదు కోట్ల కోసం ఆరాటం

అయిదు కోట్ల కోసం ఆరాటం

ఒక్క సక్సెస్ వస్తే చాలు అయిదు కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుందాం అన్న ఆరాటం ఎక్కువైంది ఓ హీరోకు. నిజానికి ఓ హిట్ కొట్టాక చాన్నాళ్లకు కానీ సినిమానే రాలేదు. 

నిజానికి సినిమాలు వచ్చాయి కానీ ఈ హీరోగారి వ్యవహారం వల్లనే పెద్ద బ్యానర్ లు సైతం సగంలో ప్రాజెక్టులు డ్రాప్ చేసుకున్నాయి. అలాంటి టైమ్ లో ఓ మాంచి హిట్ పడింది. మూడు, నాలుగు సినిమాలకు రెమ్యూనిరేషన్ కోటిన్నర నుంచి రెండు కోట్లలో ఫిక్స్ అయినట్లే.

కానీ అయిదు కోట్ల మేరకు అందుకోవాలని బాగానే స్కెచ్ వేసాడట ఆ హీరో. ఆ మేరకు తనకు తెలిసిన మీడియాకు ఫీలర్లు వదులుతూ, ఆ టైపులో వార్తలు రాయిస్తున్నాడట. నమ్మే జనాల సంగతి అలా వుంచితే ఇండస్ట్రీ జనాలకు తెలియదా? మూడో సినిమా కు రెమ్యూనిరేషన్ ఎంతో, నాలుగో సినిమాకు ఎంతో.

అదీగాక రెమ్యూనిరేషన్ ఎంతయినా అడిగేయవచ్చు. కానీ మార్కెట్, ఇతరత్రా లెక్కలు అవీ వేసుకనే కదా నిర్మాతలు అడుగు ముందుకు వేసేది. ఈ సంగతి తెలియక తన స్ట్రాటజీ తాను వేస్తున్నాడా హీరో. ఈ వార్తలు చదివి ఇండస్ట్రీ జనాలు నవ్వుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?