Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అయ్యప్పన్ లో పెంచలదాస్

అయ్యప్పన్ లో పెంచలదాస్

సీమ గాయకుడు పెంచలదాస్ పాటకు ఓ మ్యాజిక్ వుంది. ఇప్పటికే తెలుగులో మూడు నాలుగు పాటలు పాడాడు. అన్నీ పాపులర్ అయ్యాయి. 

మళ్లీ త్వరలో ఓ సినిమాలో పెంచలదాస్ పాట పాడబోతున్నాడు. అది కూడా మళ్లీ మరోసారి ధమన్ మ్యూజిక్ డైరక్షన్ లోనే.

పవన్ కళ్యాణ్-రానా నటిస్తున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పెంచలదాస్ ఓ ఫోక్ సాంగ్ పాడే అవకాశం వుంది. 

సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఓ నేపథ్యగీతాన్ని పెంచలదాస్ చేత పాడించాలని మేకర్లు ఆలోచిస్తున్నారు.

ఈ పాట పెంచలదాస్ పాడితే అది నెక్ట్స్ లెవెల్ లో వుంటుంది. అందుకే ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూట్ కరోనా కారణంగా ఆగింది. జూలై లేదా ఆగస్టు నుంచి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?