అయ్యగారి కేరవాన్ దిగని అమ్మడు

అయ్యగారికి మక్కువ కలిగింది. అమ్మడు అక్కున చేరింది. దాంతో ఇంకేం వుంది. అయ్యగారి ఇప్పుడు కేరవాన్ దిగడం లేదట అమ్మడు. ఓ పెద్ద హీరో. అమ్మాయిలంటే కాస్త వీక్ నెస్ అన్న గ్యాసిప్ లు…

అయ్యగారికి మక్కువ కలిగింది. అమ్మడు అక్కున చేరింది. దాంతో ఇంకేం వుంది. అయ్యగారి ఇప్పుడు కేరవాన్ దిగడం లేదట అమ్మడు. ఓ పెద్ద హీరో. అమ్మాయిలంటే కాస్త వీక్ నెస్ అన్న గ్యాసిప్ లు వుండనే వున్నాయి. 

ఇలాంటి టైమ్ లో సినిమా లో /త కడుతున్న హీరోయిన్ మీద కన్ను పడిందని టాక్. అంతే స్నేహం కలిసిపోయింది. జ‌త కుదిరిపోయింది అని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కేరవాన్ జ‌తకలిసాయని, ఇక్కడి నుంచి అక్కడికి సులువుగా చేరిపోతోందని అంటున్నారు సినీ జ‌నాలు.

వాళ్లకీ వాళ్లకీ కలిసిపోయింది. మధ్యలో మనకేంటీ నొప్పి అని అనే బాపతు జ‌నాలు వుండనే వుంటారు. కానీ అది కాదు సమస్య. ఇలా హీరోగారితో హీరోయిన్ కు జ‌త కలిసినప్పటి నుంచీ దర్శకుడికి తలనొప్పి మొదలైందని టాక్. 

షాట్ రెడీ అంటే వెంటనే షాట్ కు రావడాలు, మాట మన్నించడాలు ఇలాంటివి అన్నీ కాస్త దూరం అయ్యాయట. పాపం, కాస్త పేరున్న డైరక్టర్ నే కానీ, ఏం చేయగలరు..హీరోయిన్ కు వెనుకున్న హీరోను చూసి నిట్టూర్చడం తప్ప.

ఏదో విధంగా సర్దుకుపోయి, సినిమాను తీసి అవతల పడేస్తే అదే పదివేలు అనుకుని ముందుకు సాగుతున్నారట.