చాలా ఊహించుకొని తెలుగులోకి తిరిగొచ్చింది అంజలి. మహేష్, వెంకటేష్‌ల `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నానంటే… ఇక అవకాశాలు ఓ రేంజ్లో వస్తాయని అనుకొంది. స్టార్స్ నాకోసం క్యూ కడతారనుకొంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం తలకిందులైపోయాయి. బలుపు, మసాలా సినిమాలు మినహా ఆమెకి మరో అవకాశం దక్కలేదు. రెకమెండేషన్లు పెట్టింది, ఫొటో షూట్లు చేయించుకొంది. అయినా ఫలితం కనిపించలేదు.
అందుకే చివరికి కమెడియన్‌తో సినిమా చేయడానికి అంగీకరించింది. శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమాలో అంజలి హీరోయిన్గా నటిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అంజలికోసమే ఈ సినిమా జరుగుతున్న విషయాన్ని రహస్యంగా ఉంచారని సమాచారం. ఆమె ఇప్పటికీ స్టార్స్ పక్కన అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకొంది.
అందుకే శ్రీనివాసరెడ్డితో నటిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలని చిత్రబృందాన్ని సూచించింది. అలా అయితేనే ఈ సినిమాలో నటిస్తానని షరతు పెట్టిందట. అయినా సమాచారం బయటికి పొక్కింది. మరి ఈ సినిమా విజయం సాధిస్తేనైనా సీతమ్మ సుడి తిరుగుతుందేమో చూడాలి.