ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి – ది కంక్లూజన్ గురించి బాలీవుడ్ పత్రికలు సరికొత్త ప్రచారానికి తెర తీశాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల ఈ ఏడాదే అని హడావుడి మొదలుపెట్టాయి. ఇవిఇస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది క్రిస్ మస్ రోజున బాహుబలి పార్ట్ టూ విడుదల కానుంది. అంటే 2016 డిసెంబర్ 25 వ తేదీన బాహుబలి రెండో భాగం విడుదల కానుంది.
విశేషం ఏమిటంటే.. అదే రోజున బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సినిమా 'దంగల్' కూడా విడుదల కానుంది. దీంతో క్రిస్ మస్ రోజున బాక్సాఫీసు వద్ద అమిర్ ఖాన్ సినిమా కూ, రాజమౌళి సినిమాకూ పెద్ద పోరాటమే ఉండనుందని ఆ పత్రికలు విశ్లేషిస్తున్నాయి! బాహుబలి గురించి కే వలం తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా.. హిందీ సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేదానికి ఈ విశ్లేషణలే రుజువు.
ఈ సంగతిలా ఉంటే… బాహుబలి ద్వితీయ భాగం విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన లేదు. ఆ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా లేకుండా వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందా.. అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ డిసెంబర్ 25న బాహుబలి కంక్లూజన్ పార్ట్ విడుదల అని బాలీవుడ్ వైపు నుంచి ప్రచారం మొదలైంది. మరి దీనిపై బాహుబలి యూనిట్ వివరణ ఇస్తుందా?!