రామ్ గోపాల్ వర్మ..సంచలన దర్శకుడు..ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించే దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. బుధవారం ఉదయం ఈ మేరకు కోద్ది సేపట్లో ఆయన ఓ వాయిస్ ఓవర్ విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ఆ వాయిస్ ఓవర్ లో వంగవీటి రాధా సినిమాకు సంబంధించి ఆయన ఉద్దేశాలు వుంటాయి.
అయితే ఈ వాయిస్ ఓవర్ పేరిట చేసే ప్రకటనలో, వివిధ కులాలు, వాటి నాయకులు, కృష్ణా జిల్లా రాజకీయాలు, ఇంకా చాలా చాలా విషయాలను ఆయన పేర్లతో సహా బోల్డ్ గా ప్రకటించనున్నట్లు వినికిడి. అంతే కాదు, ఆయన తనకు ఈ వంగవీటి రాధా సినిమానే ఆఖరి సినిమా అని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కొంత కాలంగా కమ్మవారిని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే కమ్మవారితో కలిసిన పవన్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ తో ఆయన ఉద్దేశాలు మరింత క్లియర్ అయ్యే అవకాశం వుంది.