సుమ..ఆలీ విబేధాలు నిజమేనా?

సుమ..ఆలీ..ఏ సినిమా వేడుక అయినా, అద్భతమైన టైమ్ సెట్..టైమ్ సెన్స్ తో యాంకరింగ్ చేసే జంట. అలాంటది కొద్ది కాలంగా ఈ ఇద్దరు కలిసి యాంకరింగ్ చేయడం అన్నది కనిపించడం లేదు. ఓ ఫంక్షన్…

సుమ..ఆలీ..ఏ సినిమా వేడుక అయినా, అద్భతమైన టైమ్ సెట్..టైమ్ సెన్స్ తో యాంకరింగ్ చేసే జంట. అలాంటది కొద్ది కాలంగా ఈ ఇద్దరు కలిసి యాంకరింగ్ చేయడం అన్నది కనిపించడం లేదు. ఓ ఫంక్షన్ సందర్భంగా ఆలీ వ్యాఖ్యలు సుమను బాధ పెట్టాయని, ఆ వెంటనే స్టేజ్ వెనుక గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని వదంతులు వినవచ్చాయి. కానీ ఆ తరువాత అవి నిజం కావని కొందరు అంటూ వచ్చారు. కానీ ఆ తరువాత మరి ఈ జోడీ ఏంకరింగ్ అన్నది కనిపించలేదు. ఇప్పుడు ఈ విబేధాలు నిజమే అనిపించే మరో విషయం బయటకు వచ్చింది.

ఏటా మా టీవీ అవార్డుల ఉత్సవం జరుగుతుంది. దానికి ఈ ఇద్దరు కలిసే ఏంకరింగ్ చేస్తారు. పైగా అలా చేసిన ప్రతిసారీ ఈ ఇద్దరు కలిసి మాంచి స్పూఫ్ ఒకటి చేస్తారు..అది మగధీర కావచ్చు..బాహబలి కావచ్చు. సూపర్ గా వుంటుంది కూడా. ఈసారి మళ్లీ మాటీవీ అవార్డుల ఉత్సవం దగ్గరకు వస్తోంది. ఈసారి కూడా కూడ స్పూఫ్ విడియో వుంటుంది. కానీ ఆలీ మాత్రం లేడని తెలుస్తోంది. ఆలీకి బదులుగా పృధ్వీ, సంపూర్ణేష్ బాబు, సుమతో కలిసి ఈ స్పూఫ్ లో నటించారు.  సుమ శివగామిగా, సంపూర్ణేష్ బాబు కాలకేయుడిగా, బాహుబలిగా, రెండుపాత్రలు పృధ్వీ కట్టప్పగా నటించారు.

ఈ స్పూఫ్ విడియో బిట్ ను మా టీవీ ట్వీట్ చేసింది. మరి ఆలీ లేనట్లే అన్నది కన్ ఫర్మ్ అయితే, ఇన్నాళ్లుగా కలిసి చేస్తున్న సిరీస్ ను పక్కన పెట్టారు అంటే ఆ ఇద్దరి నడుమ విబేధాలు కరెక్టే అనుకోవాలి.