Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబోయ్..రీమేక్ నా?

బాబోయ్..రీమేక్ నా?

హీరో రామ్ రీమేక్ అంటేనే ఉలిక్కి పడుతున్నాడు. మసాలా ఇచ్చిన షాక్ ఇది. అప్పటి నుంచి రీమేక్ అంటే ఆమడదూరంలో వుంటున్నాడు. ఆ మధ్య ధనుష్ తమిళ సినిమా వేలైయిల్ల పట్టాధారి ని రీమేక్ చేద్దామనుకుని, మళ్లీ వదిలేసాడు. 

అది తెలుగులో రాఘవన్ బిటెక్ గా వచ్చి, సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు మలయాళంలో హిట్ అయిన ప్రేమమ్ తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేస్తారని టాక్ వచ్చింది.అయితే దాన్నీ ఖండించాడు. అలాంటిది ఏమీ లేదన్నాడు. మొత్తానికి 'మసాలా'ఘాటు రామ్ నషాలానికి బాగానే తగిలింది. కొన్నాళ్లు రీమేక్ ల జోలికి వెళ్లడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?