రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' తొలి పార్ట్ (బిగినింగ్) వచ్చేసింది. రెండో పార్ట్ ఎప్పుడొస్తుందా? అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అసలు సినిమాకి ముందు ట్రెయిలర్లా 'బాహుబలి' మొదటి పార్ట్ గురించి చెప్పుకుంటున్నారు. సినిమాపై క్రియేట్ అయిన హైప్కీ, సినిమాలో వున్న ఎమోషన్స్‌కీ బ్యాలెన్స్ కాక, కొందరు నిరాశపడినా, అసలు పార్ట్‌ని మిగిల్చి రాజమౌళి మంచి పనే చేశడాన్న అభిప్రాయాలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ కండలు తిరిగిన శరీరం.. బారీ యుద్ధ సన్నివేశాలు.. రాజమౌళి మార్క్ ఎమోషన్స్.. అన్నీ సెకెండ్ పార్ట్‌లో వున్నాయన్న ప్రచారం నేపథ్యంలో మళ్ళీ హైప్ క్రమక్రమంగా పెరిగిపోతోంది. తెలుగు తెరపై ఆషామాషీ ప్రయోగం కాదిది. ఒకే కథని రెండు పార్టులుగా సినిమా తీసి, దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత (ఏడాది తర్వాతే బాహుబలి సెకెండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉవంది) రావడం అంటే, అది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే.
సినిమాని తెరకెక్కించడం, దానిపై హైప్ పెంచడం, ఆ హైప్‌ని తట్టుకునేలా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, వారి మన్ననలు అందుకోవడానికి ఎంతో ధీరత్వం కావాలి. ఆ ధీరత్వం రాజమౌళిలో వుందన్న విషయం ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడిక 'బాహుబలి' నెక్స్ట్ పార్ట్‌పై అంచనాలు పెరుగుతున్న దరిమిలా, దాన్నెప్పుడు రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడో వేచి చూడాల్సిందే.