సెన్సారుకు, విడుదలకు మధ్య కాస్త గ్యాప్ దొరికింది బాబు బంగారం సినిమాకు. దాంతో పూర్తిగా ఒకటి రెండు సార్లు ఫైన్ ట్యూన్ చేసుకున్నారని వినికిడి. అ..ఆ సినిమా విషయంలో కూడా దర్శకుడు త్రివిక్రమ్ ఇదే సూత్రం పాటించారు. అది విజయం అందించింది. అందుకే అదే కంపెనీ నుంచి వస్తున్న సినిమాకు కూడా దర్శకుడు మారుతి అదే సూత్రాన్ని పాటించారట.
సినిమా ఫస్ట్ హాఫ్ హిలేయరియస్ గా వచ్చిందట. అలాంటపుడు సెకండాఫ్ మీద అంచనాలు పెరిగిపోతాయి. ఏమాత్రం తేడా వున్నా అది పెద్దగా కనిపిస్తుంది. అందుకే సెకండాఫ్ ను పదే పదే ఫైన్ ట్యూన్ చేసారట. సెకండాఫ్ లో కేవలం రెండే పాటలు వుంటాయి. ఫస్ట్ హాఫ్ లో నవ్వించిన పృధ్వీ సెకండాఫ్ ఫైనల్ లో మళ్లీ ఎంటర్ అవుతాడట. అలాగే బ్రహ్మీ కూడా డిఫరెంట్ గా క్లాస్ కామెడీ అందిస్తాడట. వీటి మధ్యలో పాట బ్రేక్ వుండకుండా చూసుకున్నారట.
యూజువల్ గా మూడు పాటలు వుంటాయి. అందుకని రెండే చేసారట. అలాగే సీన్లు కూడా డిటైల్డ్ గా చూసి వన్ మినిట్ తేడా వున్నా కూడా ఆ మేరకు ట్యూన్ చేసారట. మొత్తానికి బంగారానికి బాగానే నగిషీలు అద్దుతున్నట్లున్నారు.