అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో అఖిల్ లుక్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే లుక్ కూడా వచ్చేసింది. వుమెన్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ అన్నట్లుగా మైక్ ముందు పూజా నిల్చుని, తన రెండు చేతుల్లో రెండు షూస్ పట్టుకున్న స్టిల్ ఇది.
ఇంతకీ పూజా షూస్ చేతుల్లోకి ఎందుకు తీసుకుంది అన్న పాయింట్ కు సమాధానం సినిమాలో వుండొచ్చు. ఇలాంటి పోస్టర్ విడుదల చేస్తే సినిమా మీద సహజంగానే ఆసక్తి కలుగుతుందనే అయిడియా కూడా కావొచ్చు. వరుసగా సక్సెస్ లు కొడుతూ చేతిలో దాదాపు మరో మూడు కీలకమైన సినిమాలు వుంచుకున్న పూజా హెగ్డే స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాకు కావాల్సిన అటెన్షన్ కు కాస్తయినా డ్రా చేసినట్లే ఈ స్టిల్ తో.
బన్నీ వాసు నిర్మించే ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. వాసువర్మ నిర్మాణంలో, స్క్రిప్ట్ లో సహ భాగస్వామిగా వున్నారు.