కొన్నాళ్ల క్రితం భవ్య ప్రొడక్షన్స్ లో ఓ సినిమా ఫిక్స అయింది హీరో నాగశౌర్యకు. డైరక్టర్ హరీష్ శంకర్ దగ్గర పనిచేసిన రాజా అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఓకె అయింది. కానీ ఎందుకో,అలా అలా ముందుకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఆ కొత్త దర్శకుడు, హీరో నాగశౌర్య కూడా ఆ ప్రాజెక్టు కు స్వస్తి చెప్పేసారు.
కానీ అదే ఇద్దరు కలిసి మరో ప్రాజెక్టు టేకప్ చేసారు. ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేష్ కోనేరు నిర్మాతగా వుంటుంది. కొత్త పాయింట్, కొత్త కథ ను తీసుకుని ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. అంతకు ముందు ఓకె చేసిన కథ సెట్ కాకనే భవ్యతో ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అప్పట్లోనే అదే దర్శకుడు చెప్పిన మరో పాయింట్ మీద హీరో నాగశౌర్య రుమాలు వేసి వుంచుకున్నాడు.
ఇప్పుడు ఆ మేరకు ఆ పాయింట్ తో మహేష్ కోనేరుకు సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాను కీర్తి సురేష్ తో నిర్మించారు. ఈ సినిమా మార్చి ఫస్ట్ వీక్ లో విడుదలకు రెడీ అవుతోంది.