ఎలిమెంటరీ స్కూలు పిల్లాణ్ణి చూసినట్లు చూస్తారు..ఈ క్వశ్చన్ వింటే. అయితే తెలుగు సినిమాల్లో తెరవెనుక చాలా జరుగుతుంటాయి. అందునా ఓ స్టేజ్ కు వచ్చేసాక, సహాయం చేసే జనాలు పెరుగుతూ వుంటారు. రాజమౌళే స్వయంగా సెకండ్ యూనిట్ ను తన కొడుకు కార్తీక్ డైరక్ట్ చేసాడని క్రెడిట్ కార్డు టైటిల్స్ లో వేసాడు.
నేపధ్య సంగీతానికి కూడా రాజమౌళి సినిమాలకు కీరవాణి పేరుతో పాటు, అరేంజ్ మెంట్స్ అంటూ ఆయన సోదరుడు కళ్యాణ్ మాలిక్ పేరు కూడా వేస్తుంటారు.
బాహుబలికి కూడా అలాగే వేసారు. అయితే రీరికార్డింగ్ లో కీరవాణి సూపర్ విజన్ తో పాటు, మరో సంగీత దర్శకుడి పాత్ర కూడా వుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల గుసగుస. రాజమౌళికి ఆ యువ సంగీత దర్శకుడి రీరికార్డింగ్ అంటే ఇష్టం అంట. అందుకని ఈగ సినిమా నుంచి ఇప్పటి వరకు రీరికార్డింగ్ దగ్గర వుండి ఆ సంగీత దర్శకుడి చేత చేయించుకుంటారని తెలుస్తోంది.
ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు, జీవన్ అనబడే జెబి. గతంలో చాలా సినిమాలకు సంగీతం అందిచాడు,. ఇప్పటికీ అందిస్తున్నాడు. అద్భుతమైన ఫామ్ ల కాకున్నా, తనకంటూ కొన్ని సినిమాలు, బ్యానర్లు వున్నాయి. బాహుబలి రీరికార్డింగ్ లో కూడా జీవన్ పాత్ర చాలా వుంది అని వినికిడి.