దిల్ రాజు సినిమాకు డైరక్టరెవరు?

నిర్మాత దిల్ రాజు ఓ కొత్త విషయం వెల్లడించారు. జనవరి నుంచి ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆయన తిరుపతిలో చెప్పారు, ఇప్పటి వరకు ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమ అంటూ ఏదీ…

నిర్మాత దిల్ రాజు ఓ కొత్త విషయం వెల్లడించారు. జనవరి నుంచి ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆయన తిరుపతిలో చెప్పారు, ఇప్పటి వరకు ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమ అంటూ ఏదీ బయటకు రాలేదు. సుకుమార్, భోగవిల్లి ప్రసాద్ సినిమా తరువాత ఏది? అన్నది ఇంతవరకు ఫైనల్ కాలేదు. 

మరి దిల్ రాజు మాటల ప్రకారం ఆ ప్రాజెక్టే తరువాతది అనుకోవాలి. మరి త్రివిక్రమ్ ఓ సినిమా ఎన్టీఆర్ తో చేయాలని అనుకుంటున్నాడని వార్తలు వినవచ్చాయి. కానీ దాని నిర్మాత వేరు. మరి దిల్ రాజు సినిమాకు డైరక్టర్ ఎవరైవుంటారు? కొంపదీసి మళ్లీ హరీష్ శంకర్ రంగంలోకి వస్తాడా ఏంటి?