బాహుబలి శాటిలైట్ పై భలే గ్యాసిప్ లు

బాహుబలి శాటిలైట్ భలే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు రెండు భాగాలకు కలిపి పాతిక కోట్లకు అమ్మేసారని వినిపించాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు.…

బాహుబలి శాటిలైట్ భలే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు రెండు భాగాలకు కలిపి పాతిక కోట్లకు అమ్మేసారని వినిపించాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అసలు శాటిలైట్ వెనుక వాస్తవమేమిటి?

బాహుబలి శాటిలైట్ కు చానెల్ వాళ్లు 12 దాకా ఆఫర్ చేసారు. అయితే అది సరిపోదని కనీసం 15 అన్నా కావాలని యూనిట్ పట్టుపట్టింది. ఈ నేపథ్యంలో రాజమౌళికి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి రంగప్రవేశం చేసారు. ఏం తగ్గక్కరలేదు. 18 అన్నా వస్తాయి. అంతగా కాకుంటే ఆ పదిహేను తాను ఇస్తానని, తనకు వదిలేయమని అడిగేసారు. దాంతో అక్కడికి అది ఆగింది. ఇక్కడ సాయి కొర్రపాటి ఐడియా వేరే వుందని వినికిడి. ఆయన దగ్గర తుంగభద్ర, దిక్కులు చూడకు రామయ్యా సినిమాలు వున్నాయి. వాటన్నింటిని ప్యాకేజీగా అమ్మాలన్నది ఆ ప్లాన్. ఆ మధ్య సురేష్ బాబు అలాగే చేసారు గోపాల గోపాల సినిమాకు. 

ఇప్పుడు సినిమా భయంకరమైన హిట్ అయింది కాబట్టి సహజంగా డిమాండ్ వస్తుంది. అయితే రామోజీరావు తీసుకుంటారా..అడిగారా అన్నది పాయింట్ కాకపోవచ్చు. ఇంత మొత్తం పెట్టి తీసుకుని, ప్రకటనలు ఆ రేంజ్ లో తెచ్చుకోవడం అన్నది ఈటీవీ టీఆర్పీకి కాస్త కష్టం. అలాంటి వ్యవహారాలు మా, జెమిని, జీ కే చెల్లు. అందువల్ల ఈ టీవీ దిశగా వెళ్లే ప్రస్తక్తి వుండకపోవచ్చు. రామోజీకి ఈ సినిమాకు ఫైనాన్స్ బంధాలు వున్నాయని టైటిల్స్ తోనే రూఢి అయింది. అది వేరే ట్రాక్. దాని దారిన అది నడుస్తుంది. దీని దారిన ఇది నడుస్తుంది అన్నది టాలీవుడ్ బోగట్టా.