'ఎన్టీఆర్' బయోపిక్ తర్వాత ఇకపై తాను నటించే సినిమాలన్నీ స్వీయ నిర్మాణంలో చేయాలని భావించిన బాలకృష్ణ ఆ చిత్రానికి వచ్చిన నష్టాలతో నిర్మాణం జోలికి పోవడం లేదు. ఇప్పుడు కనుక నిర్మాణం పేరు చెబితే 'ఎన్టీఆర్' బయోపిక్ నష్టాలని బర్తీ చేయాల్సి వుంటుంది కనుక తన తాజా చిత్రాన్ని సి. కళ్యాణ్ బ్యానర్లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి గాను బాలకృష్ణ పది కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలకృష్ణకి గతంలో నాలుగైదు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చేవారు. కానీ 'ఎన్టీఆర్' బయోపిక్ భారీ రేట్లకి సేల్ అవడంతో ఈ చిత్రానికి బాలయ్య పది కోట్లు డిమాండ్ చేసారు. బాలకృష్ణ అడిగిన తర్వాత ఇక కాదనేది వుండదు కనుక ఈ నిర్మాత కూడా కాదనకుండా అడిగిన దానికి తల ఊపేసాడు. అయితే బాలకృష్ణ చిత్రాలకి అంత గిరాకీ వుందా? మార్కెట్ పరంగా ఆయన సినిమాలు ఆ స్థాయిలో నిలబడుతున్నాయా?
బాలకృష్ణ చిత్రాలు ఆడితే బాగానే ఆడుతుంటాయి కానీ మిస్‌ఫైర్ అయితే మాత్రం భారీ నష్టాలు తప్పవు. అయినా కానీ బాలకృష్ణ డిమాండ్ చేసిన తర్వాత ఈ లెక్కలన్నీ చెప్పడానికి నిర్మాతలకి ధైర్యం చాలదు. లాభాల్లో వాటా ఇవ్వడం లాంటి పేచీల కంటే అడిగినంత ఇచ్చేయడమే మేలని భావిస్తుంటారు. ఎన్ని డిసెంబర్లో వస్తాయో, వీటిలో ఎన్నిటికి ఆదరణ దక్కుతుందో చూడాలి.