మెగాస్టార్ చిరంజీవిగారిపై నా అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ పోస్టింగులకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు. నాకు ట్విట్టర్ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్ అక్కౌంట్లుగాని లేవు. నేను తిరుపతి అర్బన్∙డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్నరోజుల్లో చిరంజీవిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు. అప్పటినుంచి ఆయనతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి.
శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డిగారికీ, శ్రీ చిరంజీవిగారికీ మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశంపార్టీయే ఈ దుష్ప్రచారానికి పూనుకుంది. నాకు అభిమాన సంఘాలు అంటూ లేవు. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. శ్రీ జగన్‌గారికి మాత్రమే ఉంటాయి. నేనూ జగనన్న అభిమానినే. నా అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.