గత వేసవిలో బాలకృష్ణ, అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్ చిత్రాలని అందించి సమ్మర్‌కి సూపర్ కిక్ స్టార్ట్ ఇచ్చారు. వేసవిలో బాక్సాఫీస్‌ని ఫుల్ బిజీగా ఉంచడంలో వీరిద్దరూ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మనం, దృశ్యం వగైరా హిట్స్ వచ్చి బాక్సాఫీస్ మరింత కళ కళలాడిరది. ఈసారి కూడా సమ్మర్‌కి వీరిద్దరే ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అట.
లెజెండ్ వచ్చినట్టే బాలకృష్ణ లయన్ మార్చి నెలాఖరులో రిలీజ్ అవుతోంటే, రేసుగుర్రం మాదిరిగానే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఏప్రిల్ సెకండ్ వీక్‌ని టార్గెట్ చేస్తోంది. ఈసారి కూడా అలాంటి హిట్స్ రిపీట్ అయ్యాయంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ చిత్రాలు సమ్మర్లో రిలీజ్ అవుతున్నాయి.
బాలకృష్ణ ఎప్పటిలా తనకి అచ్చి వచ్చిన మాస్ మసాలానే నమ్ముకుని లయన్ చేస్తే… బన్నీ కూడా యూజువల్‌గా తాను చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్నే అందిస్తున్నాడు.