మహేష్ బాబు ఫ్యాన్స్ కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య ఉప్పు నిప్పులా వుంటుంది. నిన్నరేణుదేశాయ్ మహేష్ ఫ్యాన్స్ పై నిప్పులు చెరిగింది. వెబ్ లో అయిటమ్ లు వస్తే, మహేష్, పవన్ ఫ్యాన్స్ ఇటు అటు కామెంట్లతో కొట్టుకున్నంత పని చేస్తారు. కానీ ఆంధ్ర నాట ఇంకో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.
గుంటూరు జిల్లాలో మహేష్ బాబును తెలుగుదేశం జనాలు స్వంతం చేసుకున్నారు. తెలుగుదేశం ఫ్లెక్సీలు వగైరాలపై మహేష్ బొమ్మ యధేచ్ఛగా వాడేస్తున్నారు. మహేష్ స్వంత బావ గల్లా జయదేవ్ ఇక్కడ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రలో పవన్ సినిమా విడుదలైతే, తెలుగుదేశం జనాలే బ్యానర్లు కడుతున్నారు.
పనిలో పనిగా లోకల్ నాయకుల వాటిపై పవన్ ఫొటోతో పాటు తమ ఫొటో కూడా వేసుకుంటున్నారు. గోపాల గోపాలకు చాలా థియేటర్ల వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రత్యక్షం అయ్యాయి. ఆ విధంగా పవన్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని వారి యత్నం.
అంటే మొత్తానికి తెలుగుదేశం పార్టీ జనాలు ఈ ఇద్దరు హీరోలను స్వంతం చేసేసుకున్నారు. మరి ఆ పాటి దానికి ఒకేపార్టీలో వుండే ఇద్దరు హీరొలకు ఫ్యాన్స్ వేరు వేరుగా వుండి కామెంట్ల నూరుకోవడం ఎందుకో..వారు కూడా కలిసిపోతే మంచిది కదా?