త్రివిక్రమ్ సినిమాకు శివారెడ్డి డబ్బింగ్?

ఒక్కోసారి పరిస్థితులు చిత్రంగా మారుతుంటాయ్. కొత్త కొత్త పరిణామాలకు దారితీస్తుంటాయి. విధి సడెన్ గా మంచి కమెడియన్ ఎమ్ ఎస్ నారాయణను తీసుకుపోయింది. త్రివిక్రమ్ తాజా సినిమా సన్నాఫ్ సత్యమూర్తిలో ఎమ్ఎస్ కు మంచి…

ఒక్కోసారి పరిస్థితులు చిత్రంగా మారుతుంటాయ్. కొత్త కొత్త పరిణామాలకు దారితీస్తుంటాయి. విధి సడెన్ గా మంచి కమెడియన్ ఎమ్ ఎస్ నారాయణను తీసుకుపోయింది. త్రివిక్రమ్ తాజా సినిమా సన్నాఫ్ సత్యమూర్తిలో ఎమ్ఎస్ కు మంచి పాత్ర వుందని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర డబ్బింగ్ వర్క్ కాలేదు.ఇప్పుడు ఎమ్ ఎస్ మన మధ్య లేరు. 

అందుకు ఆ పాత్రకు డబ్బింగ్ మిమిక్రీ శివారెడ్డి చేత చెప్పిస్తారని వినికిడి. శివారెడ్డి మిమిక్రీలో ది బెస్ట్ అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ కు ఎమ్ ఎస్ అంటే చాలా ఇష్టం.ఆయనకు అత్తారింటికి దారేది, జులాయిలో కూడా మంచి పాత్రలు పోషించే అవకాశం ఇచ్చారు.

గతంలో సుత్తి వీరభద్రరావు సడెన్ గా మరణిస్తే, ఆ సినిమా దర్శకుడు జంధ్యాల తను స్వయంగా డబ్బింగ్ చెప్పారు.అంతే కాదు, ఆ సినిమాలో కొన్ని సీన్లలో కాళ్లు, పంచె మాత్రం కనిపిస్తాయి. అవి కూడా జంధ్యాలవే.